Saturday, 13 July 2013

అమ్మకు అక్షరాభిషేకం



                                                                                                                              రచన : కమల్ తేజ్

అమ్మ అనే రెండు బీజాక్షరాలు
అనురాగం కురిపించు అక్షయాలు
అవనిలోని తన బిడ్డలను
అనుక్షణం  కాపాడు రక్షకాలు
 
దేవుడే కనిపించని ఈ లోకంలో
కని పెంచే తల్లే
కనిపించే దేవతరా
 
అమ్మ లాలన ఎంతో తియ్యన
అమృతధారల కన్నా
అమ్మ దీవెన ఎంతో మిన్న
ఆ దేవుని దీవెన కన్నా
 
అమ్మ మనసు
అన్నివేళలా నవనీతం
ఎన్నిసార్లు బిడ్డ గాయపరచినా
అన్నిసార్లు మరిచిపోవటమే ఆమె  నైజం  
అమ్మ అవటంతో అవుతుంది
ఆడబ్రతుకు ఎంతో సార్ధకం
అమ్మను ఆరాధించకపోతే
ఎవ్వరి బ్రతుకైనా నిరర్ధకం
 
 ****

No comments:

Post a Comment